EHS-Lr.no.6380 Clarifications on Enrolling Health Cards in Telugu
ఉద్యోగుల ఆరోగ్య పథకం – కొన్ని అంశాలపై సందేహాలు –వాటిపై వివరణ
ఉద్యోగుల ఆరోగ్య పథకం కు సంబంధించిన తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు:
Category | Proceeding |
State | Andhra Pradesh |
Department | EHS |
Proceeding No | Lr.No.6380/EHS/2013 |
Date | 10/12/2013 |
Subject | Clarifications on Enrolling Health Cards |
1. భార్య లేదా భర్తలు ఉద్యోగస్తులైనపుడు, ఒకరు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని ఉత్తర్వుల్లో వున్నది . కాని ఇద్దరి తల్లిదండ్రులను ఆధారితులుగా దరఖాస్తులో పొందుపరిచే అవకాశంమున్నదా ? 104 టోల్ నంబరు వారు మాత్రము ఇద్దరి తల్లిదండ్రులను ఆధారితులుగా పేర్కొనవచ్చునని చెప్పారు .
జవాబు: దంపతులిద్దరూ ఉద్యోగులు లేదా పెన్సనర్లు ఐన పక్షంలో ఒక్కరే ఎన్రోలై ప్రీమియం చెల్లిస్తారు. రెండవ వారు ఎన్రోలైన వారికి అధారితులవుతారు. వారిలో ఎవరు ఎన్రోల్చే సుకొని ప్రీమియం చెల్లిస్తున్నారో వారి తల్లిదండ్రులను మాత్రమే (వారిపై జీవనబృతికి ఆధారపడియున్న పక్షంలో ) ఆధారితులుగా దరఖాస్తులో పొందుపరిచే అవకాశమున్నది.
2.కొందరు ఉద్యోగుల తల్లి లేదా తండ్రికి రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్డ్ ఉన్నది. కొందరికి తెల్ల రేషన్ కార్డ్ ఉన్నది. మరికొందరికి వృద్దాప్య పెన్సన్ వస్తుంది. ఇటువంటి వారిని ఆధారితులుగా హెల్త్ కార్డ్ లో చేర్చవచ్చునా? లేదా?
జవాబు: ప్రభుత్వము ద్వారా అమలుచేయబడుతున్న పథకాలకింద (రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్డ్, తెల్ల రేషన్ కార్డ్, వృద్దాప్య పెన్సన్ ) లబ్ది పొందుతున్న వారిని ఆధారితులగా చేర్చరాదు.
3.కొంత మంది ఉద్యోగుల తల్లిదండ్రులకు మైనరు పిల్లలున్నారు. వీరికి ప్రత్యేకంగా రేషన్ కార్డ్ ఉంటుంది. ఇటువంటి తల్లిదండ్రులకు ఆధారితులుగా చేర్చుకోవచ్చునా?
జవాబు: ఉద్యోగుల తల్లిదండ్రుల మైనరు పిల్లల లను (అనగా ఉద్యోగి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ) ఆధారితులుగా చేర్చరాదు.
4. భార్య భర్త లలో ఒకరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, రెండవ వారు R.T.C / కేంద్ర
ప్రభుత్వ / బ్యాంకు / జీవిత భీమ ఉద్యోగిగా యుంటారు. ఇటువంటి వారిని హెల్త్ కార్డ్ లో చేర్చవచునా?
జవాబు: భార్య భర్త లలో ఒకరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, రెండవ వారు R.T.C / కేంద్ర ప్రభుత్వ / బ్యాంకు / జీవిత భీమ ఉద్యోగిగా “ఆరోగ్య సేవలు” పొందుచున్న పక్షంలో వారిని ఆధారితులుగా చేర్చరాదు. వారిని “రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పతాకంలో” చేర్చాలనుకుంటే వారు పై పథకాల పరిథి నుండి విదోలిగి నట్లు లిఖిత పూర్వక హామీ పత్రం జత చేయాలి.
5. మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సరిహద్దు ప్రాంతములో పనిచేసేవారు ఇతర రాష్ట్రాల పట్టణాలలో నివాసం వుంటున్నారు వారి అడ్రస్సు పేర్కొనుటకు సాఫ్ట్ వేర్ లో ఇతర రాష్ట్రాల లోని పట్టణాల పేర్లు రావటం లేవు. ఏమి చేయాలి?
జవాబు: రాష్ట్రాలను ఎంచుకొనే సదుపాయాన్ని అప్లికేషన్లో పొందుపరచడానికి చర్యలు తీసుకోబడుతున్నాయి. ఇతర రాష్ట్రాలలో ఉన్న లబ్దిదారులు తామున్న రాష్ట్రాన్ని ఎంచుకొని తమ చిరునామా పొండుపరచుకో వచ్చును. ఒక
వారం సమయం లో పై సదుపాయం కల్పించపడుతుంది.
6. ఉద్యోగుస్తులు దరఖాస్తులను online చేయుటకు చివరి తేది ఏది? ఏ నెల నుండి ప్రీమియం మినహాయింపు చేస్తారు?
జవాబు: ఉద్యోగులు / పెన్సనర్లు online దరఖాస్తులు సమర్పించుకోవడానికి చివరి తేది ఏది లేదు. అందరు ఉద్యోగులు / పెన్సనర్లు నమోదయ్యేందుకు కొనసాగే ప్రక్రియ. అయితే 04-12-2013 తేదీన పత్రికా ప్రకటన ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు తెలియజేసినట్లుగా ప్రస్తుతం అమలులో ఉన్న వైద్య ఖర్చుల రీయంబర్స్మెంట్ 2014 జనవరి 1 నుండి రద్దవుతుంది. మరియు , ఉద్యోగుల /
పెన్సనర్ల జనవరి నెల వేతనాలు / పించన్ల నుండి ప్రీమియం వసూళ్లు ప్రారంభమవుతాయి. కావున పదవిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు /
పెన్సనర్లు 31-12-2013 లోగా ఎన్రోల్ అవడం శ్రేయస్కరం.
7. ఉద్యోగస్తుల ఆరోగ్య పథకం online చేయుచున్నప్పుడు వచ్చే సందేహాలను రాజీవ్ ఆరోగ్య స్కీము (104) వారే నివృత్తి చేస్తారా ? ఇతరులెవరైనా యుంటారా?
జవాబు: సందేహాల నివృత్తికొరకు website లోని తరుచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు చూడండి. అందులో మీరు అడగదలిచిన విషయాలకు సంబంధించిన సమాచారం లేకుంటే , మీరు 104 సేవాకేంద్రాన్ని ప్రదించవచ్చును. అంతే గాక , పై website లో క్రింద వరుసలో ఉన్న “సంప్రదించండి” అనే “ట్యాబు” నొక్కితే అందులో “cantact us” అనే విండో ఓపెన్ అవుతుంది. అందులో ఇవ్వబడిన వ్యక్తులకు phone / mail ద్వారా సంప్రదించవచ్చును.
8. కొంతమంది డ్రాయింగ్ అధికారుల పరిధిలోని ఉద్యోగ వివరాలు website లో లేనప్పుడు అట్టి వివరాలను ఎవరు upload చేస్తారు?
జవాబు: ప్రతి డిపార్టుమెంటు యొక్క శాఖాధి పతుల తమ తమ శాఖలలోని మంజూరైన మొత్తం పోస్టుల వివరాలు మరియు ఒక్కొక్క డ్రాయింగ్ ఆఫీసర్ పరిధిలోని పోస్టుల వివరాలు టేబుల్స్ 1 మరియు 5 లలో ఇచ్చారు/ ఇస్తున్నారు. ఏవైన పోస్టులు పొండుపరచక పోతే, సంబంధిత శాఖాధి పతి ద్వారా అట్టి వివరాలు పంపే ఏర్పాటు చేసుకోవాలి.
9. మెడికల్ రియంబర్స్మెంట్ స్కీం ఎప్పటి దాక అమల్లో వుంటుంది? 6 నెలల దాక ఉండాలనేది మా అభిప్రాయం. ఎన్రోల్మెంట్ ఆలస్యం అవుతున్నందున ఈ హెల్త్ స్కీం ప్రారంభం సమాంతరంగా మెడికల్ రియంబర్స్మెంట్ స్కీం కూడా వుండాలి .
జవాబు: 04-12-2013 తేదీన పత్రికా ప్రకటన ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
గారు తెలియజేసినట్లుగా ప్రస్తుతం అమలులో ఉన్న వైద్య ఖర్చుల రీయంబర్స్మెంట్
2014 జనవరి 1 నుండి రద్దవుతుంది. మరియు , ఉద్యోగుల / పెన్సనర్ల జనవరి నెల వేతనాలు/ పించన్ల నుండి ప్రీమియం వసూళ్లు ప్రారంభమవుతాయి. కావున పదవిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు / పెన్సనర్లు 31-12-2013 లోగా ఎన్రోల్ అవడం శ్రేయస్కరం.
Download Lr No 6380 Clarifications on Enrolling Health Cards from here