Celebrate August month as Attendance Month Fest in TS Schools & Action Plan for Achieving 100% Student’s Attendance

Action Plan for Achieving 100% Student’s Attendance & Celebrate August 2019 month as ‘Attendance Month Fest’ in TS Schools. Telangana School Education Department has given the Detailed Action Plan for achieving 100% attendance of students in TS Schools.

Detailed guidelines have been issued for Celebrate the August month as ‘Attendance Month Fest’ in Telnagana Schools. The following initiatives have been suggested to all schools to increase the Student’s attendance.

Attendance Month Fest in TS Schools

Meanwhile, in order to increase attendance of students, the School Education department has decided to conduct a ‘Haazir Masotsavam’ (Month of Attendance) in August in all government and local body schools.

Students who register the highest attendance will be felicitated by the school including appreciation before the assembly and will also be given cash prizes or gifts.

During a recent interactive session, Secretary (Education) Dr B Janardhan Reddy had directed government school headmasters to implement the ‘Month of Attendance’ programme effectively.

Names of the students who maintain full attendance will be written on the classroom walls. This gives some sort of recognition and also motivates others to attend school regularly.

The schools were instructed to constitute an attendance committee comprising students with highest attendance. The committee will reach out to irregular students and ensure that they attend school regularly.

The schools have also been asked to form committees like sports, hygiene, and cultural, and involve students with low attendance. This not just creates interest among students to attend the school but will also help them acquire leadership skills. The entire idea of the programme is to enhance attendance in schools.

ఆగష్టు నెల – విద్యార్థి హాజరు మాసోత్సవం

Parent Declaration

నేను అనగా……………………….,
 నా కుమారుడు ……………………..,
………వ తరగతి , గ్రామం ………………….. : ను ఆగష్టు నెలలో……ప్రాధమిక/ప్రాథమికోన్నత/ఉన్నత పాఠశాలకు…ఒక్క రోజు కూడా  గైర్హాజరు గాకుండా రెగ్యులర్ గా పంపిస్తాను. మా ఇంటి మరియు వ్యవసాయం పనుల నిమిత్తం…మా అబ్బాయిని ఎట్టి పరిస్థితుల్లో కూడా…బడి మాన్పించను.

మా పిల్లవాడు బడి నుండి ఇంటికి వచ్చాక చదువుకునేటప్పుడు/వ్రాసుకునేటప్పుడు… ఇంట్లో TV switchoff  చేస్తాను మరియు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ ను వాడుటకు ఇస్తానని మాట ఇస్తున్నా. Sign of Parent……… Date:……….

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెరగాలంటే.. తొలుత విద్యార్థుల హాజరు శాతం పెరగాలి. ఈ లక్ష్యంతో విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున్న హాజరు ఉద్యమాన్ని ప్రారంభిస్తోంది. విద్యార్థుల హాజరు ప్రాముఖ్యాన్ని వివరిస్తూ దీన్ని ఓ ఉద్యమంలా తల్లిదండ్రుల్లోకి తీసుకెళ్లబోతోంది.  ఈ కార్యక్రమానికి ‘హాజరు మాసోత్సవం’గా నామకరణ చేశారు. ఆగస్టు నెలంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ప్రస్తుతం సగటున రోజుకు 20-25 శాతం మంది విద్యార్థులు తరగతులకు గైర్హాజరు అవుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గైర్హాజరు శాతాన్ని బాగా తగ్గించి, చదువుపై విద్యార్థుల్లో మరింత ఆసక్తి పెంచాలనేది విద్యాశాఖ ఉద్దేశం.

‘‘తమ పిల్లలు ప్రతిభావంతులు కావాలని అందరు తల్లిదండ్రులు కోరుకుంటారు. అది నెరవేరాలంటే విద్యార్థులు క్రమం తప్పకుండా బడికి రావాలి. తరగతులకు తరచూ గైర్హాజరయ్యేవారు చదువులో వెనకబడతారు’’ అని నిపుణులు సూచిస్తున్నారు. హాజరు ప్రాముఖ్యంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అవగాహన పెంచాలంటే ఓ ఉద్యమంలా బలంగా సమాజంలోకి తీసుకెళ్లాలని విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి భావిస్తున్నారు.

విద్యా విధానంలో మార్పులపై ఈ నెల 31 లోపు గ్రామాల్లోని విద్యావంతులు, తల్లిదండ్రులు, యువతతో చర్చిస్తారు. హాజరు మహోత్సవం కార్యక్రమాన్ని వివరిస్తారు. ఈ ఉద్యమంలో తల్లిదండ్రులు, స్వయం సహాయక సంఘాలు, విద్యపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష డ్వాక్రా సంఘాలు పాల్గొననున్నాయి.  విద్యార్థులు ఎందుకు బడికి రావడం లేదు. వారికి ఉన్న సమస్యలు ఏమిటనే వివరాలు సేకరిస్తారు. నిత్యం పాఠశాలలకు హాజరయ్యే పిల్లల పేర్లు బోర్డులపై రాసి  ప్రోత్సహిస్తారు. సంవత్సరం మొత్తం హాజరైన వారికి దాతల సహాయంతో సైకిళ్లు వంటి బహుమతులు అందిస్తారు.

 ప్రతి తరగతిలో 5 ముఖ్యమైన అంశాలపై విద్యార్థులతోనే కమిటీలు ఏర్పాటు చేస్తారు. అందులో ఒకటి ఆరోగ్యం-పరిశుభ్రత. అనారోగ్య కారణాలతో విద్యార్థులు బడికి రాని పరిస్థితులు ఉంటున్నందున వారికి అవసరమైన వైద్య పరీక్షలపై దృష్టి సారిస్తారు.పాఠశాలల్లో ‘హాజరు మాసోత్సవం’:పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదుటి. విజయకుమార్, ఐ.ఎ.ఎస్., కమీషనర్ గారి ఉత్తర్వులుసర్క్యులర్ సంఖ్య : 10/ కరికులం విభాగము / తెలంగాణ/2019,తేది : 16-07-2019

విషయము: పాఠశాల విద్యాశాఖ – రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ – ఆగస్టు, 2019 మాసం లో ‘హాజరు మాసోత్సవం’ నిర్వహించడం గురించి – ఉత్తర్వులు

సందర్భం : టెలికాన్ఫరెన్స్, కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ వారి సూచనలు, తేదీ : 25-06-2019,

పై విషయం పురస్కరించుకొని జిల్లా విద్యాధికారులందరికి తెలియజేయునది ఏమనగా, తేది : 16-07-2019 రోజు “టి-సాట్ ద్వారా నిర్వహించిన టెలికాన్ఫెర కార్యక్రమంలో గౌరవ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి గారు పిల్లలు సక్రమంగా రోజు బడి కి హాజరు కావడం యొక్క ప్రాధాన్యతను తెలియజేసారు. ఈ కార్యక్రమం ద్వారా చర్చించిన అంశాల ఆధారంగా ఆగస్టు 2019 మాసాన్ని “హాజరు మాసోత్సవం”గా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో నిర్వహించడానికి పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి 100% హాజరుండేలా చర్యలు చేపట్టుటకు నిర్ణయించారు.

పిల్లల బడి  అందుబాటులో ఉండడం, నమోదు, వారు బడిలో కొనసాగడం, నాణ్యత వంటివి పాఠశాల విద్యకు ముఖ్యమైన లక్ష్యాలు, మౌలిక వసతులు కూడా సవాలుగా ఉండేవి. గత మూడు దశాబ్దాల కాలంలో పాఠశాల విద్యలో చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమాలు, స్వయం సహాయక బృందాల సహకారం, సమాజ భాగస్వామ్యం ద్వారా మొదటి మూడు లక్ష్యాలు దాదాపుగా సాధించాం. పిల్లలందరూ నాణ్యమైన విద్యను పొందే హక్కును కలిగివున్నారు. వారందరూ నాణ్యమైన విద్యను పొందేలా చేయడం పాఠశాల విద్యకున్న ముఖ్యమైన లక్ష్యం!

మన రాష్ట్రంలో 29,267 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 1 నుండి 10వ తరగతి వరకు 26,18,095 మంది పిల్లలు చదువుతున్నారు. 1,16,828 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సుమారు 14 వేల కోట్ల రూపాయలను పాఠశాల విద్యాశాఖ మీద ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. సగటున ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్దిమీద సాలీనా 50,000/- రూపాయలు ఖర్చు అవుతున్నది. అలాగే రెసిడెన్షియల్ పాఠశాలలో సుమారు ఒక్కో విద్యార్థి మీద సుమారు 1,00,000/- రూపాయలు ఖర్చు అవుతున్నది.

మన రాష్ట్రంలో మంచి విద్యా ప్రణాళిక ను రూపొందించుకున్నాం, ఇందుకమగుణంగా నూతన పాఠ్యపుస్తకాలు రూపొందించుకొని, పరీక్ష సంస్కరణలు అమలు పరుస్తున్నారు. పిల్లలందరికీ ఏకరూప దుస్తులు, పాక్యపుస్తకాలను ప్రభుత్వమే అందిస్తున్నది. మధ్యాహ్నభోజన పథకం ద్వారా పిల్లలకు పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కూడా
మెరుగుపడినవి. ఇవన్నీ ఉన్నప్పటినీ నాణ్యత ప్రశ్నార్థకంగా ఉంది. ఈ మధ్యకాలంలో జరిగిన జాతీయ, రాష్ట్ర స్థాయి అధ్యయనాలు కూడా ఈ విషయాలను తేటతెల్లం చేస్తున్నవి.

ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ తన ‘ఏన్ అన్ సర్టెన్  గ్లోరీ’ (An Uncertain  Glory) పుస్తకం లో కూడా పిల్లల గైర్హాజరీ గురించి ప్రస్తావించారు. పాఠశాలలో వసతి సౌకర్యాలు, పిల్లలకిచ్చే ప్రోత్సాహకాలు పెరిగినప్పటికి మూడింట రెండు వంతులు (2/3) మంది పిల్లలు మాత్రమే ఐ డి లో ఉంటున్నారు. అనగా 33% మంది పిల్లలు బడికి సక్రమంగా హాజరు కావడం లేదని ఇమర్త్యసేన్ పేర్కొన్నారు. పిల్లల గిరిజన పాఠశాల పనితీరును, పిల్లలు అభ్యసనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది.

విద్యలో నాణ్యత ను ప్రభావితం చేసే అంశాలు ఎన్ని ఉన్నప్పటికీ పిల్లలు భౌతికంగా బడికి హాజరు కావడం అనేది ముఖ్యమైనది. క్రమం తప్పకుండా రోజు బడికి వచ్చే పిల్లలు తరగతి లో చురుకుగా పాల్గొన డే కాకుండా చదువుల్లో చక్కగా రాణిస్తారు. ఇలా క్రమం తప్పకుండా రోజు బడికి వచ్చే పిల్లలు నేర్చుకోవడంలో కూడా ముందుంటారు.

పిల్లలు రోజు బడికి రాకపోవడం వల్ల ఏం జరుగుతున్నది?
ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు పిల్లలందరు ఏదో ఒక పాఠశాలలో నమోదై ఉన్నారు. అయితే కొంత మంది పిల్లలు రోజు బడికి సక్రమంగా వెళ్ళడం లేదు, ఇలా బడికి వెళ్ళని పిల్లలు బడిలో నేర్చుకోలేకపోతున్నారు, బయట ఆడుకోలేకపోతున్నాడు”, అనగా బడికి వెళ్ళని పిల్లలు బడి వేళల్లో బయట ఆడుకోవడానికి కూడా ఎవరూ ఉండరు. పిల్లల గైర్హాజరీ వల్ల ఎన్నో దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నారు.

తరచుగా బడికి గైర్హాజరు అయ్యే పిల్లల అభ్యసనం క్రమం తప్పుతున్నది. దీని వలన చదువులో వెనుకబడి, వారు చదువుతున్న తరగతి స్థాయిని పొందలేకున్నారు. నేర్చుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజా ధనం వృధా అవుతుంది. పిల్లలు వారి బాల్యాన్ని కోల్పోతున్నారు. దీర్ఘకాలికంగా హాజరుకాకపోవడంవల్ల బడినుండి శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదముంది.

దుర్వ్యసనాలకు, దురలవాట్లబారినపడే ప్రమాదం పొంచి వుంది. బోధన లో కూడా సమస్యలను సృష్టిస్తున్న ది. వీరి ప్రభావం తోటి విద్యార్థులు మీద కూడా పడుతున్నది. దీన్ని అరికట్టినప్పుడు మాత్రమే మనం అనుకున్న నాణ్యతను సాధించగలం, కాబట్టి పిల్లలందరూ క్రమం తప్పకుండా బడిగి హాజరయ్యేలా  చూడడం అత్యంత ఆవశ్యకం గా మారింది,

మరి ఏం చేద్దాం (కార్యాచరణ ప్రణాళిక) ?
హాజరు ను పెంచడానికి క్రింది కార్యక్రమాలు చేపడదాం:
1) 2019-20 విద్యాసంవత్సరంలో బడిలో చేరిన పిల్లందరూ క్రమం తప్పకుండా రోజు హాజరయ్యేలా చూడాలి. ప్రతి పాఠశాలలో సగటున 100% హాజరు ఉండేలా కృషిచేయాలి. తద్వారా అభ్యసనాన్ని మెరుగు పరచాలి,

2) స్వయం సహాయక బృందాలు భాగస్వాములను చేయడం. 
ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన రాష్ట్రంలో చైతన్యవంతమైన, సంఘటిత, సాధికారిక మహిళా సంఘాలు ఉన్నాయి. ఇవి స్వయం సహాయక బృందాలుగా చైతన్యవంతంగా పనిచేస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పిల్లలు హాజరు పెంచ వచ్చు. ఇందుకోసం గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలన సంస్థ” (ఎస్.ఇ.ఆర్.పి.)ఆధ్వర్యం లో ప్రతి గ్రామంలో తల్లులు భాగస్వామ్యం చేయడానికి అనుకూలంగా గ్రామ సమాఖ్య ఉన్నాయి.

అలాగే పట్టణ ప్రాంతాల్లో అనగా “పురపాలక ప్రాంత పేదరిక నిర్మూలన సంస్థ కు (ఎమ్.ఇ.పి.ఎమ్.ఎ.) చెందిన సమాఖ్యలున్నాయి. స్వయం సహాయక మహిళా బృందాలు వాటి లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రతి మాసంలో నిర్ణీతతేదీల్లో రెండు సమావేశాలు జరుగుతాయి. మొదటి సమావేశంలో వారికి చెందిన ఆర్థికాంశాల గురించి, రెండవ సమావేశంలో సామాజిక అంశాల గురించి చర్చిస్తారు.

ప్రతి మాసంలో జరిగే మహిళా సమాఖ్య రెండవ సమావేశంలో సామాజిక
ఆంకాల గురించి చర్చిస్తారు. ఈ సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు హాజరు కావాలి ఈ సమావేశంలో పిల్లలు హాజరు పెంచడం అనే అంశం గురించి చర్చించాలి. 

ఈ వేదికను ఉపయోగించుకొని పిల్లలహాజరు ను పెంచడానికి ప్రయత్నించడం, బడి లోని పిల్లలు తల్లిదండ్రులను చైతన్యపరచడానికి, వారికి అవగాహన కల్పించడానికి గ్రామ స్థాయిలో గ్రామ సమాఖ్యలను, మండల స్థాయిలో మండల సమాఖ్య ను, జిల్లా స్థాయిలో జిల్లా సమాఖ్య సేవలను వినియోగించుకోవాలి,

3) బడిలో పిల్లలు తల్లిదండ్రులను చైతన్యపరచడానికి, వారికి అవగాహన కల్పించడానికి గ్రామ స్థాయిలో గ్రామ సమాఖ్యలను, మండల స్థాయిలో మండల సమాఖ్య ను, జిల్లా స్థాయిలో జిల్లా సమాఖ్య సేవలను వినియోగించుకోవాలి.

4) బాలల సంఘాలు:
బడికి పిల్లలు రోజు హాజరు కావాలంటే కేవలం పాఠ్య బోధనా పరిమిత మైతే సరిపోదు. పిల్లలను
వివిధ కార్యక్రమాలో భాగస్వాములను చేయడం ద్వారా వారు రోజు బడికి హాజరయ్యే లా చేయవచ్చు. అది వారి చదుపు కూడా ప్రభావితం చేస్తుంది.

కాబట్టి పిల్లలకు సహజమైన నాయకత్వపు లక్షణాలు పెంపొందింప తీయడానికి, వారికి బడి పట్ల ఆసక్తిని కలిగించడానికి, వారిని భాగస్వాములను చేయడం ద్వారా బరి లో హాజరు ను పెంచడానికి ప్రతి పాఠశాలలో “బాలల సంఘాలను ఏర్పరచాలి. అన్ని పాఠశాలల్లో ఈ కింది బాలల సంఘాలు ఏర్పాటు కావాలి. (బాలల సంఘాలు వివరాలు జతచేయనైనది.)

5) అభినందించడం/ ప్రోత్సాహకాలు అందించడం :
అ) రోజు సక్రమంగా హాజరయ్యే పిల్లలు, ఆ పాఠశాల ఉపాధ్యాయులు గుర్తించి అభినందించడం ద్వారా ప్రోత్సాహక వాతావరణాన్ని ఏర్పరచాలి. దీనికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదు. చప్పట్లు కట్టించడం, వారి గురించి ప్రశంసించడం, దండలు వేయడం, రాతల సహకారంతో ప్రోత్సాహకాలు అందించడం వంటివి చేయాలి.

ఆ) ప్రతి బడిలో అత్యధిక హాజరుశాతమున్న విద్యార్థుల ను గుర్తించి పాఠశాల అసెంబ్లీ, పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ ఎం.సి.) సమావేశాలు వారిని, వారి తల్లిదండ్రులను చప్పట్లతో అభినందించాలి, దాతల సహకారంతో ఆ పిల్లలకు నిఘంటువులు / కథల పుస్తకాలు / సైకిళ్ళు వంటి వాటిని ఇవ్వడం ద్వారా ప్రోత్సహించాలి.

ఇ ) పిల్లల హాజరు శాతం అత్యధికంగా ఉన్న పాఠశాలలు గుర్తించి మండల విధ్యాధికారి ఆయా ఉపాధ్యాయులకు అభినందించాలి, సత్కరించాలి, అలాగే జిల్లా స్థాయిలో జిల్లా విద్యాధికారి, రాష్ట్ర స్థాయిలో కమిషనర్ గారు కార్యక్రమం నిర్వహిస్తారు.

8) తల్లిదండ్రులు బడి పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచడం:
 ఒక రోజు రాకపోయినా / తరచుగా గైర్హాజరు అయ్యే పిల్లలు పాఠశాల హాజరు కమిటీ గుర్తించి నేరుగా వారి ఇండ్లకు వెళ్లి తల్లిదండ్రులు మాట్లాడి ఆ పిల్లలు బడికి హాజరయ్యేలా చూడాలి.

7) ఇతర శాఖ లు సమన్వయం  :
అ) ప్రధానోపాధ్యాయుడు గ్రామ స్థాయిలో వివిధ శాఖలు (ఆరోగ్య శ్రీ – శిశు సండ్రీమ, వ్యవసాయ, బ్యాంకు, తపాలా శాఖ మొ||  సమన్వయం కలిగివుండి హాజరును పెంచడంలో వారి ని భాగస్వాములుగా చేయాలి. అలాగే మండల స్థాయిలో మండల విధ్యాధికారి సమన్వయ సమావేశాలు నిర్వహించి భాగస్వాములను చేయాలి. ఆరోగ్య స్త్రీ – శిశు సంక్షేమ, ఎస్. ఐ ఆర్.పి. (సెర్చ్) వంటి  శాఖలు సమన్వయం ఏర్పరచుకొని హాజరు పెంచడానికి కృషి చేయాలి

ఆ) జిల్లా స్థాయిలో జిల్లా విద్యాధికారి జిల్లా కలెక్టర్ గారితో చర్చించి జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని ఏర్పరచాలి. హాజరు ప్రాధాన్యతను వివరించి వివిధ శాఖలు (ఆరోగ్య శ్రీ – శిశు సంక్షేమ, ఎస్.ఇఆర్.పి. (సెర్ప్), డి.ఆర్.డి.ఎ మొదలగునవి) భాగస్వాములను చేయడం ద్వారా విద్యార్థులందరూ సక్రమంగా రోజు హాజరయ్యేలా చూడాలి

8) పాఠశాలను ఆకర్షణీయంగా పిల్లలు ఆసక్తి కలిగేలా తీర్చిదిద్దడం : 
పాఠశాలలో సహపాఠ్య కార్యక్రమాలు అనగా ఆటలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ పోటీలు, సృజనాత్మక కార్యక్రమం, బాల సభలు మొదలగువాటిని నిర్వహించడం ద్వారా పిల్లలు బడి పట్ల ఆసక్తి పెంచేలా చేయవచ్చు.

కాబట్టి, అకడమిక్ క్యాలెండర్ లో సూదించిన కార్యక్రమాలతో పాటు పిల్లలు ఆసక్తి కలిగించే రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లలు బడికి రోజూ హాజరయ్యే లా చేయాలి.

9) నాణ్యతను సాధించడం : బడిలో చేరిన పిల్లలందరిలో తాము చదువుకోగలుగుతున్నామని, నేర్చుకుంటున్నామని భావనను పెంపొందించాలి. కనీస సామర్థ్యాలు లేని విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న Attainment of Basic Competencies – ABC (‘మూలాల్లో కి వెళదాం’) కార్యక్రమాన్ని నిర్వహించి సాధించి లా చేయాలి.

తద్వారా విద్యార్థులందరూ తరగతి వారీగా అభ్యసన ఫలితాలు సాధించేలా చేయాలి, కృత్యాలు, ప్రాజెక్ట్ పనులు, జట్టుపనులు, ప్రయోగాలు, అన్వేషణలు, చర్చలు, ప్రదర్శనలు వంటి వాటి  ద్వారా బోధనాభ్యసన ప్రక్రియలు పిల్లలు భాగస్వాములనుచేసి ఆసక్తిని పెంపొందించాలి.

పైన తెలిపిన కార్యాచరణ ప్రణాళిక లోని అంశాలు పాఠశాల అమలు పరచడం ద్వారా విద్యార్థులందరూ సక్రమంగా లో బడికి వచ్చేలా చేయాలి. ఆగస్టు 2019 మాసం లో “హాజరు మాసోత్సవాలు”లో భాగంగా వీటిని నిర్వహించడం ద్వారా పాఠశాల విద్యాశాఖ లో నూతన ఉత్తేజాన్ని పెంపొందించాలి. ఇది ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా కృషిచేయాలి.

ఆగు 2019 మాసారంభంలో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతాన్ని గుర్తించి మాసాంతానికి పాఠశాలల వారీగా సాదించిన విద్యార్థుల హాజరు ప్రగతి వివరాల నివేదిక కమీషనర్ పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి జిల్లా విద్యాధిబారులు పంపగలరని కోరనైనది.

100% Student’s Attendance Achievement

*Disclaimer: We have published the above information for reference Purpose only, For any changes on the content we refer to visit the Official website to get the latest & Official details, and we are not responsible for anything

Pavzi.com | 12thmodelpaper.in | 10thmodelpaper.in | model-paper.com | JNVST Result 2024 | Sample Paper 2024 | Board Paper 2024 | Sample Paper 2024 | EDPOST | Model Paper 2024 | JNANABHUMIAP.in | Board Model Paper 2024| Happy New Year Wishes SalesHours

Leave a Comment