Pothana Poems Competitions 2023 to 10th Class Students in TS Schools

Pothana Poems Competitions 2023 to 10th Class Students in TS Schools: School-level, Mandal level, District level, State level Pothana Poems competitions 2023 to 10th class students in Telangana state. RJD of School Education, Warangal has given instructions on conducting the Pothana Poems Competitions 2023 to 10th Class Students in TS Schools.

RJD Warangal has instructed to all the District Educational Officers in the Zone-V to instruct all the Mandal Educational Officers in your Jurisdiction to follow the schedule and give the books to S.A (Telugu) and S.A Telugu may be further instructed to teach, Bhagavad Gita so as to inculcate moral values and cultural heritage to students.

The DEO’s are instructed to send books to high enrolment schools (only X class) and submit the list of schools to RJD by August 10, 2019, for onward submission to Sri K.V.Ramanachary, IAS, Adviser to Government.Pothana Poems Competitions 2019 Dr. K.V.Ramanachary, IAS@, Advisor to Government of Telangana, Hyderabad Lr.No. Dt:27-7-2019

విషయం: పోతన పద్యాలు పదవ తరగతి విద్యార్థుల నోట పదైనా నర్తించేలా సమిష్టి కృషి – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ సహాయ సహకారాలు అర్థించుట గురించి; ఒక జాతి ఉజ్జ్వల భవిష్యత్తు గతం లోని మంచి కాపాడు కుంటూ ముందుకు సాగడం లో ఉంటుంది. రానున్న తరాలకు గట్టి పునాదులను అందించడం లో వుంటుంది. విలువలు తెలుసుకొని సటించడంలో వుంటుంది.

✤ ‘దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు’ అంటూ పోతన మనకందించిన పలుకులు ఎంత అర్ధవంతమైనవి! భాషా మాధుర్యాన్ని, విలువలతో కూడిన ఆలోచనల్ని మనసుకు హత్తుకునేలా చెప్పగలిగిన భాగవత కర్త పోతనామాత్యుడు ప్రాతఃస్మరణీయుడు.

✤ పాశ్చాత్యధోరణుల పోకడలు రెపరెపలాడుతున్న పసిమనసులు భాష గురించి, జాతి ఔన్నత్యం గురించి, ఘన సంస్కృతి గురించి, తమ నడతును గమనిస్తూ సరి దిద్దుకోవడం గురించి, ప్రస్తుత యువత దృష్టి సారించాల్సిన స్థితిగతుల ఆవశ్యకత గురించి ఒక చిన్న ప్రయత్నం చేయాలన్న సంకల్పం పోతన భాగవత ప్రచార సమితికి కలిగింది.

✤ మన తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి శ్రీ బి. జనార్ధన్ రెడ్డి గారితో పోతన భాగవత ప్రచార సమితి తరుపున ఈ విషయం ప్రస్తావించి నప్పుడు వారు కార్యాచరణకు పూనుకున్న తీరు, నా నమ్మకాన్ని మరింత పెంచింది. మన రాష్ట్రంలోని ఇద్దరు పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్తాధికారులను (RJDs), వారి ద్వారా జిల్లా విద్యా శాఖాధికారి (DEOs), వారి ద్వారా మండల స్థాయి విద్యా శాఖాధికారి (MEOs), ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాగస్వాములుగా చేయడం ద్వారా ఈ సంకల్పాన్ని సాకారం చేసుకోగలమన్న విశ్వాసం ఏర్పడింది. రాష్ట్రంలోని ఉన్న త పాఠశాలలో గల వేలాది పదవ తరగతి విద్యార్థులను చేరుకో గల ప్రణాళికలు రూపొందించడం జరిగింది.

✤ పోతన భాగవత ప్రచార సమితి పథనిర్దేశకులైన ఆదరణీయులు సర్వ శ్రీ పుచ్చా మల్లిక్, మహా మహోపాధ్యాయ బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మ, యమ్ వి ఎస్  ప్రసాద్, IAS, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ఆచార్య వంగపల్లి విశ్వనాథం, అచార్య కోవెల సుప్రసన్నాచార్య, డా. నందిని సిధారెడ్డి లతో పాటు ఎంతో భాషాభిమానులు, విద్వాంసుల ఆశయం మేరకు రూపొందించబడిన ప్రణాళికను నిర్దిష్ట కాల పరిమితి లో అమలు పరచడం ద్వారా ఆశయసిద్ధి చేకూరుతోందని ఆశ.

✤ భాషా సంస్కృతుల పరిరక్షణ కై చిన్నారి విద్యార్థులను  ఉత్తేజపరిచి, కావలసిన, రావల్సిన మంచి మార్పును వారి ముందుండి నడిపేందుకు అనువుగా రూపొందించబడిన ఈ ప్రణాళిక తెలుగు జాతి భవిష్యత్తుకు శ్రీ రామరక్ష కాగలదని ఆకాంక్ష.ఉడతా భక్తిగా మన పాత్రను మనం పోషిద్దాం.ముందుకు సాగుదాం. కలిసి కదులుదాం.రానున్న తరంలో నూతనోత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపుదాం.ప్రతి నోట పోతన పద్యాలు పదైనా నర్తించేలా కృషిచేద్దాం.కార్యాచరణ ప్రణాళిక – ప్రతి నోట పోతన పద్యాలు

1. 2017 జూలై 31 లోపు హైదరాబాద్, వరంగల్ లో వున్న ఇద్దరు పాఠశాల విద్యాశాఖ
సంయుక్త సంచాలకులు (RIDg)
(అ) భాగవతం ఆణిముత్యాలు’ (500 ప్రతులు)
(ఆ) మందార మకరందాలు (500 ప్రతి);
(ఇ) 10,000 గాంధీ సూక్తులు
ఒక్కొక్క RJD కి 500 చొప్పున అందించబడతాయి.

2. ఇద్దరు RID లు – తమ పరిధిలోని DEO/MEO ద్వారా ఎంపిక చేయబడి ఉన్నత
పాఠశాల ప్రధానోపాధ్యాయులు 2019 ఆగష్టు 12వ తేదీలోగా ఈ పుస్తకాలు చేరేలా పర్యవేక్షిస్తున్నారు.

3. DEO/MEO ల తో చర్చించి RID లు తమ తమ పరిధిలోని చల 250 ఉన్నత పాఠశాలలను ఈ లక్ష్యసిద్ధి లో భాగంగా ఎంపిక చేస్తారు. ఒక్కొక్క ఉన్నత పాఠశాలకు ఒక్కొక్క పుస్తకం యొక్క రెండేసి ప్రతి అందేలా చూస్తారు.

4. DDO/MEO ల (ఆదేశానుసారం ఆయా ప్రధానోపాధ్యాయులు తామే స్వయంగా కానీ, లేదా తెలుగు భాషాభిమానం గల వరిష్ఠ  ఉపాధ్యాయుణ్ణి/ల్ని పాఠశాల స్థాయిలో నిర్వాహకులు గా నియమిస్తారు.

5. ఈ నిర్వాహకులు – ప్రతి నోటా పోతన కార్యక్రమ నిర్వాహకులుగా తమకందించబడిన పుస్తకాల్లో నుంచి పద్దెనిమిది(18)కి తక్కువ కాకుండా పద్యాలు ఎంపిక చేసి, ఆ పద్యాలకు టీకా తాత్పర్యంతో పాటు ఆ పద్యాల్లోని విశేషాంశాల్ని పదవతరగతి విద్యార్థుల నుండి ఎంపిక చేయబడి దాదాపు పది మంది బాలురు పది మంది బాలికలకు ఆత్మీయంగా, హృద్యంగమంగా నేర్పిస్తారు.
రాగయుక్తంగా అనిపించడం ముఖ్యం కానీ, భావ యుక్తంగా, అర్థవంతంగా అప్పచెప్పగల్గడం అవసరం. ఈ శిక్షణ సెప్టెంబర్ 26 లోగా చేపట్టడం; ముగించడం జరగాలి.

6. ఈ మధ్య కాలంలో అంటే ఆగస్టు 12 – సెప్టెంబర్ 26 లోపు గానే – ఎంపిక చేయబడిన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల్లో ఎంపిక చేయబడిన
(అ) పద్యాల వివరాలు పట్టిక,
(ఆ) ఎంపికైన బాలబాలికల వివరాలు పట్టికను ఆయా MEO ల ద్వారా DEO లకు అందేలా చూస్తారు. ఆయా DEO లు తమ RJD ద్వారా విద్యాశాఖ కార్యదర్శి గారికి పంపుతూ ఒక ప్రతి drkvrc@gmail.com కు పంపుతారు.

7. పాఠశాల స్థాయి పోటీలు:
2019 సెప్టెంబరు నెలాఖరులోగా – పాఠశాల వారీగా – ఆయా పాఠశాలల్లో పోటీలను నిర్వహించి మొదటి మూడు (Top 3) స్థానాలు పొందిన మువ్వురు బాలురు, మువ్వురు బాలికల పేర్లు MEO ల కంద చేస్తారు

8. మండల స్థాయి పోటీలు: 
MEO లు మండల స్థాయిలో పోటీలు నిర్వహించి, మండల స్థాయిలో మొదటి రెండు (Top 2) స్థానం పొందిన ఇరువురు బాలురు, ఇరువురు బాలికల్ని నిర్ణయించి, ఈ విజేతల పేర్లను DEOకు అందచేస్తారు. 2019 అక్టోబరు మాసంలోపుగా (త్రైమాసిక పరీక్షలు, సెలవులను దృష్టిలో పెట్టుకొని) మండల స్థాయి పోటీలు నిర్వహింపబడతాయి.
* మండల స్థాయిలోని విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు.

9. జిల్లా స్థాయి పోటీలు: 
DEO లు జిల్లా స్థాయిలోని పోటీలు నవంబర్ మాసపు మొదటి పక్షంలో గా నిర్వహించి – మొదటి రెండు స్థానాలు (Top 2) పొందిన ఇరువురు బాలురు, ఇరువురు బాలికల్ని జిల్లా స్థాయి విజేతలుగా నిర్ణయించి, ఆ వివరాలను RJD ద్వారా విద్యా శాఖ కార్యదర్శి గారికి పంపుతూ ఒక ప్రతి drkVrc@gmail.com కి పంపాల్సిన ఉంటుంది.
* జిల్లా స్థాయిలోని విజేతలకు బహుమతి ప్రదానం వుంటుంది.

10. రాష్ట్ర స్థాయి పోటీలు: 
నవంబర్ చివరి వారంలో కాని, డిసెంబర్ మొదటివారంలో గాని రాష్ట్ర స్థాయి (అర్థ సంవత్సరపు పరీక్ష, సెలవుల ను దృష్టిలో పెట్టుకొని) పోటీలు హైద్రాబాదులో నిర్వహించి, Top Ten గా వున్న బాలురు, Top Ten గా వున్న బాలికల్ని న్యాయ నిర్ణేతలు ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది, పోటీలు తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రాంగణంలోను నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తుంది. పోతన భాగవత ప్రచార సమితి ఆయా సంస్థల సమన్వయంతో, రాష్ట్ర స్థాయి పోటీలు ఉదయం 9 గం. నుండి సాయంత్రం 5 గం. మధ్య కాలంలో ఉంటాయి.

11. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే వారు – ఒక్కొక్కరు తాము పఠించే రెండు పద్యాలు తమ ప్రతిభను చాటుకోవాల్సి ఉంటుంది. అదే రోజు సాయంత్రం 6 గం.కి హైదరాబాదులోని రవీంద్రభారతి లో బహుమతి ప్రదానోత్సవ సభ వుంటుంది. ఆ సభలో ప్రోత్సాహక బహుమతలు కూడా ఇవ్వబడతాయి.

ఈ విషయంలో మరిన్ని వివరాలు ఏవైనా కావాలన్నా, సందేహాలేమైనా వున్న, సలహాలు సూచనలేవై నా అందించాలన్నా డా.కె.వి. రమణాచారి  గార్నిగానీ, ఆచార్య వంగపల్లి విశ్వనాథం గార్ని గాని సంప్రదించవచ్చు.  a. డా.కె.వి. రమణాచారి: 9848098990; drkvic@gmail.com, b. డా. వి. విశ్వనాథం; 7989180414; Viswam.Vangapally@srisree

Pothana Poems Competitions

*Disclaimer: We have published the above information for reference Purpose only, For any changes on the content we refer to visit the Official website to get the latest & Official details, and we are not responsible for anything

Pavzi.com | 12thmodelpaper.in | 10thmodelpaper.in | model-paper.com | JNVST Result 2024 | Sample Paper 2024 | Board Paper 2024 | Sample Paper 2024 | EDPOST | Model Paper 2024 | JNANABHUMIAP.in | Board Model Paper 2024| Happy New Year Wishes SalesHours

Leave a Comment