CP Brown Annual Schools Telugu Competition : Dasubhashitam has issued the CP Brown Annual Schools Telugu Competition 2020 notification for the AP and Telangana School Students and Teachers.
సిపి బ్రౌన్ వార్షిక పాఠశాలల తెలుగు పోటీ :తెలుగు రాష్ట్రాల పదవ తరగతి విద్యార్థులు, వారికి పాఠం చెప్పే తెలుగు ఉపాధ్యాయులు, ఇంకా వారి పాఠశాల కూడా రూ. 1,00,000 వరకూ నగదు బహుమతులు, సత్కారాలు, ప్రశంసా పత్రాలు గెలుచుకునే సువర్ణ అవకాశానికి స్వాగతం.
వివరాలకు ఈ వీడియోను పూర్తిగా చూడండి. దయచేసి వీడియోను వీక్షించివివరములు తెలిసికోగలరు. గొప్ప ప్రయత్నం. మనవంతు సహకారం అందించి, విద్యార్థులలో తెలుగుభాష పట్ల ఆసక్తి కలిగించి తెలుగుదనాన్ని ముందు తరాలకు అంద చేసే భాషయజ్ఞం లో మనవంతు భాధ్యతను నిర్వహించాలని ఉపాధ్యాయులకు మనవి.
శ్రీ చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు వారికి నిత్య స్మరణీయుడు. ఆ మహనీయుని సంస్మరణార్ధం ‘దాసుభాషితం’ ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాలలోని పదవ తరగతి బాలబాలికలకు తెలుగు పోటీని నిర్వహిస్తున్నది. ఈ పోటీ ముఖ్యోద్దేశం, బాలబాలికలలో తెలుగు భాష మీద ఆసక్తిని, గౌరవాన్ని పెంచడం.
పాఠశాల దశలోనే బాల బాలికలకు తెలుగు భాష, సాహిత్యం పై ఆసక్తి, గౌరవం పెంచేందుకు సీపీ బ్రౌన్ వార్షిక పాఠశాల తెలుగు పోటీలను నిర్వహిస్తున్నట్లు దాసుభాషితం వ్యవస్థాపకులు కొండూరు తులసీదాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాలల ఈ పోటీలో పాల్గొనవచ్చని సూచించారు. విజేతలకు రూ. లక్ష వరకు ఉమ్మడి బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించారు. డిసెంబరు రెండో వారంలో బహుమతులు అందజేస్తామన్నారు. పోటీలో పాల్గొనేవారు రిజిస్టర్ చేసుకునేందుకు link ను సందర్శించవచ్చని తెలిపారు
1. పోటీ ఎందుకు?
తెలుగు భాషకు ఆలంబన తెలుగు సాహిత్యం. ఈ ఆధునిక యుగంలో ఆ సాహిత్యాన్ని సులువుగా ఆస్వాదించడానికి, దాసుభాషితం శ్రవణ మాధ్యమంలో అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలుగు సాహిత్యం పరిఢవిల్లడానికి భాషాభిమానం అవసరం. అది పాఠశాల దశలోనే ఏర్పడితే జీవితాంతం ఉంటుంది.
ఒక విషయం మీద విద్యార్థులలో ఆసక్తి, ఆలోచన ప్రేరేపించడానికి పోటీలు చాలా ఉపకరిస్తాయి. మాథ్స్ / సైన్స్ ఒలంపియాడ్ తరహాలో తెలుగుకీ ఒక పోటీ ఉండాలని భావించి, ఈ పోటీ రూపకల్పన చేయడం జరిగింది.
2. పోటీకి సి పి బ్రౌన్ పేరెందుకు?
విదేశీయుడై ఉండి, ఉద్యోగరీత్యా భారత దేశానికి వచ్చి ఇక్కడ తెలుగు నేర్చుకోవడమే కాకుండా, అందులో పాండిత్యాన్ని సంపాదించి, తెలుగు నిఘంటువుతో సహా అనేక రచనలు చేసిన ఆంగ్లేయుడు, సి.పి.బ్రౌన్. ఆయన తెలుగు భాషా సాహితీ లోకానికే ఆదర్శప్రాయుడు.
తెలుగంతా ఆంగ్లమయం అయిపోతున్న ఈ రోజుల్లో, తెలుగు భాష పట్ల విద్యార్థులలో అభిమానం పెంచడానికి ఈ ఆంగ్లేయుడినే స్ఫూర్తిగా తీసుకోవడం ఉచితమనిపించింది.
3. పోటీ ఎవరికి ?
ఈ పోటీ ప్రధానంగా పాఠశాలల మధ్య. కేవలం ప్రజ్ఞ ఉన్న కొద్ది మంది విద్యార్థులకే ఈ పోటీ పరిమితం కాదు. తమతమ పాఠశాలల తరఫున ఎక్కువ మంది పదవ తరగతి విద్యార్థులు పాల్గొని, సంచితంగా (అంటే cumulative గా) అత్యధిక మార్కులతో, ఇతర పాఠశాలలపై గెలిచి పాఠశాలకు, గురువులకు, తమకు గుర్తింపు సాధించుకునే అవకాశం ఈ పోటీ కల్పిస్తుంది.
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో కేవలం ఒక్కొక్క పాఠశాల మాత్రమే విజేతగా నిలుస్తాయి. రెండవ మూడవ స్థానాలు ఉండవు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల, గురుకుల, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లోని పదవ తరగతి విద్యార్ధులందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చు.
ప్రవేశ రుసుమేమీ లేదు.
అయితే పోటీలో పాల్గొనటానికి ప్రతీ విద్యార్థికి ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న స్మార్ట్ ఫోన్ గాని / కంప్యూటర్ గాని అవసరం ఉంటుంది. ఈ పరిమితి వలన ఆశ్రమ పాఠశాలల (Residential Schools) విద్యార్థులు ఈ పోటీ లో పాల్గొనలేకపోవచ్చు. దీనికి మేము చింతిస్తున్నాము.
4. పదవ తరగతి విద్యార్థులకే ఎందుకు?
ఇందుకు నాలుగు కారణాలు.
- మొదటిది, పోటీ రసవత్తరంగా ఉండాలంటే అందులోని ప్రశ్నలు, కొన్ని సులువుగా, కొన్ని కఠినంగా సరైన మిశ్రమంలో విభిన్నంగా ఉండాలి. పదవ తరగతి విద్యార్థులైతే ఎక్కువ పాఠ్యాంశాలని చదివి ఉంటారు కనుక, వేర్వేరు అంశాలలో ప్రశ్నలు ఇవ్వడం ద్వారా ప్రశ్నావళిని ఆసక్తికరంగా కూర్చవచ్చు.
- రెండవది, గెలిచిన విద్యార్థులకు నగదు బహుమతి గణనీయమైన మొత్తంలో ఉంది కనక పెద్ద తరగతి విద్యార్థులకు అది ప్రోత్సాహకరంగా ఉంటుంది.
- మూడవది, ఈ పోటీ పూర్తిగా Online మాధ్యమం ద్వారా నిర్వహించబడుతుంది. అంటే విద్యార్థికి కొంచెమైనా సాంకేతిక అవగాహన తప్పనిసరి. పరిణితి రీత్యా పదవ తరగతి విద్యార్థులకు ఈ అవగాహన ఉంటుంది.
- నాల్గవది, పాఠశాలలో ఇదే తమ ఆఖరి విద్యా సంవత్సరం కాబట్టి, ఈ పోటీలో గెలిస్తే తమ తెలుగు ఉపాధ్యాయులకు, పాఠశాలకు అది తగిన గురుదక్షిణగా భావించి, విద్యార్థులు రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటారు.
దరఖాస్తు ఆఖరు తేదీ October 31, 2020
5. 2018 లో విజేతలు: 2018 సంవత్సరంలో జరిగిన పోటీలో రూ. 32 వేలు గెలుపొందిన పాఠశాలలు ఇవి. ప్రగతి విద్యా నికేతన్ హై స్కూల్, గద్వాల్, తెలంగాణ, శ్రీ చింతలపాటి బాపిరాజు మెమోరియల్ ఎయిడెడ్ హైస్కూల్, భీమవరం, ఆంధ్రప్రదేశ్. గెలిచిన పాఠశాల యాజమాన్యానికి జ్ఞాపిక, తెలుగు ఉపాధ్యాయులకు రూ. 5116, జ్ఞాపిక, పోటీలో పాల్గొన్న విద్యార్థులకు ఉమ్మడిగా రూ 10116, ప్రశంస పత్రాలు ఇవ్వడం జరిగింది.
6. 2019 పోటీ బహుమతులు, వితరణ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో 2018 తో పోల్చితే మొత్తం నగదు బహుమతి మూడు రెట్లు పెరిగి రూ. 1,00,000 అయ్యింది. అంటే గెలిచిన పాఠశాలకు రూ. 50 వేలు చప్పున, రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 1 లక్ష అన్నమాట. ఈ బహుమతి, కేంద్ర సాహిత్య అకాడమీ ఇచ్చే నగదు బహుమతితో సమానం. విజేతగా ప్రకటింప బడిన పాఠశాలకు, తెలుగుఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందచేసే బహుమతులు:
- పోటీలో పాల్గొన్న విద్యార్థులకు – రూ. 40000 (ఉమ్మడిగా), ప్రశంసా పత్రాలు.
- తెలుగు ఉపాధ్యాయులకు (ఉమ్మడిగా) – రూ 10,000, సత్కారం, ప్రశంసా పత్రం
- పాఠశాల యాజమాన్యానికి – జ్ఞాపిక
- 2018 లో బహుమతుల ప్రదానోత్సవం గెలుపొందిన పాఠశాలల ప్రాంగణంలోనే జరిగింది.
- 2019 లో ఈ బహుమతులు డిసెంబర్, 2019 రెండవ వారంలో హైదరాబాద్ లో ప్రముఖులతో జరిగే సభలో ఇవ్వబడతాయి.
- మరిన్ని వివరాలు గెలిచిన పాఠశాలకు ఆ సమయంలో ఇవ్వబడతాయి.
7. పోటీ తేదీ పోటీ నవంబర్ 10, ఆదివారం, పూర్తిగా ఆన్లైన్ లో నిర్వహించబడుతుంది. వివరాలు పట్టీపేజీ పైకి
8. 2019 పోటీ ఎలా ఉంటుంది ?
- తెలుగు సాహిత్యం మీద సమగ్ర అవగాహనను పెంపొందించేందుకు, ప్రశ్నావళి రెండు రాష్ట్రాలకూ ఒకే విధంగా ఉంటుంది.
- ప్రశ్నావళిలో తెలుగు భాష, సాహిత్యాలకు సంబంధించిన మొత్తం 30 ప్రశ్నలుంటాయి.
- ఒక్కొక్క ప్రశ్నకు నాలుగు సమాధానాలుంటాయి. ఇచ్చిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు గడువులోగా గుర్తించాల్సి ఉంటుంది. పోటీ కి రిజిస్టర్ చేసుకున్న తరువాత, గత సంవత్సరం ప్రశ్నవళిని మీరు చూడవచ్చు.
- ప్రశ్నలు జంబుల్ చేయబడతాయి. అంటే అందరికీ అవే ప్రశ్నలు రాకపోవచ్చు.
- పోటీలో పాల్గొనాలంటే ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ఉండడం తప్పనిసరి.
- ఒక స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి పోటీలో ఒక్కసారి మాత్రమే పాల్గొనవచ్చు.
- పోటీ నిర్ణీత సమయంలో పూర్తి చేయవలసి ఉంటుంది.
9. పోటీ కి ఎలా సన్నద్ధం కావాలి ? పోటీ తేదీన విద్యార్థులు, ఉపాధ్యాయుల సహకారం లేకుండా, స్వయంకృషితోనే రాణించాలని దాసుభాషితం అభిమతం. తెలుగు ఉపాధ్యాయులు, పోటీ తేదీ వరకు ఉన్న సమయాన్ని ప్రముఖ రచనలు, సాహితీ కారులు, సాహిత్య ప్రక్రియలు మీద పిల్లలకి అవగాహన పెంచటానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాము. దాసుభాషితం కూడా విద్యార్థులను పోటీకి మెరుగ్గా సంసిద్దులను చేయటానికి 5 సూత్రాల ప్రణాలికను సిద్ధం చేసింది. ఆ ప్రణాలికను దరఖాస్తు చేసుకున్న తరువాత చూడవచ్చు.
10. విజేతల నిర్ణయ విధానం ఒకో తెలుగు రాష్ట్రం నుంచి ఏ పాఠశాల విద్యార్ధులు సాధించిన మార్కుల స్థూల మొత్తం గరిష్టంగా ఉంటుందో, ఆ పాఠశాల విజేతగా నిలుస్తుంది. పాఠశాల మధ్య మార్కులు టై అయితే, పోటీలో పాల్గొన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా విజేత పాఠశాల నిర్ణయింపబడుతుంది. అందుకనే తెలుగు ఉపధ్యాయులు, విద్యార్థులు తమ తరగతిలో విద్యార్థులందరూ పోటీలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. ఒకవేళ మరో పాఠశాల నుంచి పాల్గొన్న విద్యార్ధుల సంఖ్య, వారు సాధించిన మార్కుల సంఖ్య కూడా సమంగా ఉన్నట్లయితే, ఇచ్చిన ప్రశ్నలలో న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసే ప్రశ్నలకు ఏ పాఠశాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు సరియైన జవాబిస్తారో, ఆ పాఠశాలను విజేతగా ప్రకటించడం జరుగుతుంది.
11. పోటీ నిబంధనలు
- పోటీ దరఖాస్తు ఫారంలో సరియైన వివరాలు ఇచ్చే బాధ్యత విధ్యార్థులదే.
- ఫలితాల నిర్ణయంలో దాసుభాషితం న్యాయ నిర్ణేతల నిర్ణయమే అంతిమం. దీనిలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు ఉండదు.
- బహుమతుల వితరణ సమయంలో విద్యార్థులు గెలిచిన పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నవారని ధృవీకరించవలసి ఉంటుంది.
- Registration Link